: ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది: ఎంపీ హరిబాబు
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి మంత్రులు, ఎంపీ, పార్టీ పదాధికారులు ఇతరులు హాజరయ్యారు. మొదటగా పార్టీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో సమాంతర అభివృద్ధి తీసుకురావాలని... పరిపాలన, అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. రాజధానిలో పరిపాలన విభాగాలు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.