: టెక్కీలకు ఇవి అనువైన నగరాలు
టెక్కీలకు ప్రపంచంలోకెల్లా అనువైన నగరాలను లింక్డ్ ఇన్ ప్రకటించింది. ఈ జాబితా టాప్ టెన్ లో ఐదు భారతీయ నగరాలు స్థానం సంపాదించడం విశేషం. ఈ జాబితాలో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు టాప్ పొజిషన్ దక్కించుకోగా, పుణే, హైదరాబాద్, చెన్నై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరో భారత నగరం గుర్గావ్ ఈ ర్యాంకుల్లో పదో స్థానంలో నిలిచింది. లింక్డ్ ఇన్ నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ జాబితా రూపొందించారు.
ఇక ఈ జాబితాలో శాన్ ఫ్రాన్సిస్కో బే, సియాటిల్, ఆస్టిన్, మెల్బోర్న్, సిడ్నీ నగరాలు కూడా ఉన్నాయి. వివిధ నగరాల్లో టెక్కీలను ఆకర్షించే అంశాలు, ఆయా సిటీలకు వలసవెళ్ళిన వారిలో టెక్కీల శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకుల జాబితా తయారుచేశారు.