: ఇరాక్ లో వారంతా సేఫ్!
ఇరాక్ లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయ నర్సుల్లో ఓ ఇద్దరిని సురక్షితంగా కర్బాలాకు తరలించారు. మోసుల్ లో 39 మంది భారతీయులు, తిక్రిత్ లో 46 మంది భారత నర్సులు చిక్కుకుపోగా వారంతా సురక్షితంగానే ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం 17 మంది ఇరాక్ ను వీడినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని భారత రాయబారులతో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ నెల 29న ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇరాక్ సహా గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసమే ఈ సమావేశం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.