: సోషల్ నెట్‌వర్క్ తో మానవసంబంధాలు నాశనం
సోషల్ నెట్‌వర్క్ సైట్‌లలో ఖాతాలుంటే.. పొద్దస్తమానమూ మొబైల్ ఆ యాప్స్ వాడుకుంటూ మెసేజీలు కొట్టుకుంటూ జీవిస్తోంటే.. టచ్‌లో ఉండడం ఎక్కువగా సాధ్యమవుతుందని వాదించేవారు దండిగానే ఉంటారు గానీ... నిజానికి ఇలాంటి నెట్‌వర్కింగ్ సైట్ ల వల్ల మానవ సంబంధాలు దారుణంగా నాశనం అయిపోతున్నాయిట. సైట్‌ల మీద ఎక్కువ సమయం గడిపేవారు.. తమ స్నేహ బాంధవ్యాలను పలుచనచేస్తున్నారంటూ ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం తేల్చింది. ఈ విషయం పరిశోధించిన డాక్టర్ బెర్మీహోగన్ 24 వేల మందిని పరిశీలించారు. నెట్‌వర్క్ సైట్‌లలో చిక్కుకుపోయిన కొందరిలో సంతృప్తి దారుణంగా పడిపోయిందని కూడా అబ్జర్వ్ చేశారు. సోషల్ నెట్‌వర్కింగ్ అలవాటు, మానవ సంబంధాలకు మధ్య చాలా లంకె ఉన్నదని పేర్కొన్నారు.