: సోనియా మీద కోపంతోనో... కేసీఆర్ మీద ప్రేమతోనో పార్టీ మారలేదు: భానుప్రసాదరావు
సోనియా గాంధీ అంటే కోపంతోనో లేక కేసీఆర్ పై ప్రేమతోనో తాము టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన భానుప్రసాదరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కయ్యానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలోనే, కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ లో చేరుతున్నామని అన్నారు. సోనియా గాంధీ అంటే ఎనలేని గౌరవమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంత కృషి చేశారో, సోనియా గాంధీ కూడా అంతే కృషి చేశారని ఆయన తెలిపారు.