: శివరామకృష్ణన్ కమిటీని కలిసిన టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం ఏర్పాటయిన శివరామకృష్ణన్ కమిటీని ఈ రోజు ఢిల్లీలో టీడీపీ నేతలు కలిశారు. వీరిలో కంభంపాటి రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస్, తోట నరసింహం ఉన్నారు. కొత్తగా ఎంపిక చేసే రాజధానికి అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మరో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటిస్తామని... వివరాల సేకరణకు అన్ని విధాలా సహకరించాలని టీడీపీ నేతలను కమిటీ కోరింది.