: పంజాబ్ కింగుల పేలవ బ్యాటింగ్


కింగుల పోరులో పంజాబ్ జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. చెన్నై సూపర్ కింగ్స్ తో సొంతగడ్డ మొహాలీలో జరుగుతున్న మ్యాచ్ లో మరో బంతి మిగిలుండగానే 138 పరుగుల స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. ఆ జట్టులో డేవిడ్ హస్సీ (41)నే టాప్ స్కోరర్. ముగ్గురు మినహా కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టులో మరెవ్వరూ రెండంకెల స్కోరు సాధించలేక చేతులెత్తేశారు. చెన్నై బౌలర్లలో బ్రావో (3), నానెస్ (2), మోరిస్ (2) రాణించారు.

  • Loading...

More Telugu News