: ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్సులు ఇవ్వండి: అనురాగ్ శర్మ
ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్సులు ఇవ్వాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతేగాక ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అదనంగా 1500 మంది హోంగార్డులు కావాలని తెలిపారు. వారిని హైదరాబాదు, సైబరాబాదు పరిధిలో నియమిస్తామని, వారాంతంలో ముందుగా సెలవులు ఇచ్చే అవకాశం ఉందని డీజీపీ వివరించారు.