: ఇది 'మసాలా' మందు..!
భారతీయ వంటకాలు అంటే గుర్తొచ్చేది వాటిలో ఉపయోగించే మసాలా దినుసులే. అన్నీ తగిన పాళ్ళలో వేస్తే ఆ రుచులే వేరు. ఇప్పుడవే మసాలా దినుసుల నుంచి ఓ దివ్యౌషధాన్ని రూపొందించారు పరిశోధకులు. ఈ మందు హైపర్ టెన్షన్ ను సమర్థంగా నియంత్రిస్తుందని వారు చెబుతున్నారు. ఈ ఔషధ తయారీలో ఉపయోగించే మసాలా దినుసులన్నీ కూడా మనం సాధారణంగా కూరలు, రసం తయారీలో ఉపయోగించేవేనట. జీలకఱ్ఱ, ఏలకులు, మిరియాలను అతిమధురం, తెల్ల కలువ రేకులతో కలిపి చూర్ణం చేసి వాడితే హై బీపీ పరారవుతుందని పరిశోధకులు ధీమాగా చెబుతున్నారు. ఈ సిద్ధ ఔషధాన్ని మరిన్ని ప్రయోగాల అనంతరం మార్కెట్లోకి తేవాలని చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్శిటీ వైద్యులు భావిస్తున్నారు.