: పూండి వద్ద రైల్వే ట్రాక్ కు బీటలు.. నిలిచిపోయిన పలు రైళ్లు


శ్రీకాకుళం జిల్లాలోని పూండి వద్ద రైల్వే ట్రాక్ కు బీటలు ఏర్పడ్డాయి. దీంతో విశాఖ-భువనేశ్వర్ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లు నిలిచిపోయాయి. అమరావతి ఎక్స్ ప్రెస్ గంటన్నర నుంచి పలాస రైల్వేస్టేషన్ లో నిలిచిపోయింది. విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ, హౌరా-చెన్నై మెయిల్, షాలిమార్ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News