: ఈ సాకర్ హీరో కొరుకుతాడు..!
ఫిఫా వరల్డ్ కప్ లో ఉరుగ్వే జట్టును నాకౌట్ చేర్చిన స్టార్ స్ట్రయికర్ లూయిస్ స్వారెజ్ మెడపై నిషేధం కత్తి వేలాడుతోంది. ఇటలీతో మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి డిఫెండర్ జార్జియో చీల్లినిని కొరికాడు. బంతిని డ్రిబ్లింగ్ చేసే సందర్భంలో వీరిద్దరూ ఢీకొన్న సందర్భంలో స్వారెజ్... చీల్లిని భుజంపై కసిదీరా కొరికాడట. ఈ ఘటనను ఫిఫా సీరియస్ గా పరిగణించింది. టీవీ ఫుటేజి ఆధారంగా స్వారెజ్ పై చర్య తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, కొరకడం స్వారెజ్ కు ఇదే తొలిసారి కాదు. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ లో లివర్ పూల్ క్లబ్ కు ఆడుతూ చెల్సియా జట్టు ఆటగాడు బ్రానిస్లావ్ ఇవనోవిచ్ ను కొరకడంతో 10 మ్యాచ్ ల నిషేధం విధించారు. అంతకుముందు 2010లోనూ స్పానిష్ లీగ్ సందర్భంగా కొరకడంతో 7 మ్యాచ్ ల నిషేధం తప్పలేదు.