: సుప్రీం న్యాయమూర్తి పదవి కాదనుకున్న సుబ్రహ్మణ్యం
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవిని సీనియర్ లాయర్ గోపాల సుబ్రహ్మణ్యం కాదనుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి తన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. స్వతంత్ర న్యాయవాది అయిన తాను ప్రభుత్వం కోరుకున్నట్లుగా పనిచేయలేనని, అందుకే ఈ అవకాశాన్ని తిరస్కరిస్తున్నానని అందులో స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా నిరాధార ప్రచారం నడుస్తోందని, తనపై చేస్తున్న ఆరోపణలన్నీ నకిలీవిగా తేల్చి చెప్పారు.