: రైలు ఛార్జీల పెంపు నుంచి స్వల్ప ఊరట


ప్రయాణికుల రైలు ఛార్జీలను 14.2 శాతం పెంచుతున్నట్టు ప్రకటించిన ఎన్డీఏ... సొంత, మిత్రపక్షాల డిమాండ్, ఒత్తిళ్లకు తలొగ్గింది. ఒక్కసారే అంత శాతం ఛార్జీలంటే చాలా భారంగా ఉంటుందని, పెంపును వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేయడంతో ఛార్జీల పెంపు నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గింది. ఈ క్రమంలో 80 కిలో మీటర్ల వరకూ ప్రయాణించే రెండో తరగతి సబర్బన్ ప్రయాణికులకు పెంపు నుంచి మినహాయింపునిచ్చింది. అటు నెలవారీ సీజన్ టెకెట్ దారులపైన కరుణ చూపి ఆ పెంపును తగ్గిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

* ఈ నిర్ణయంతో ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై వంటి మెట్రోలు, ఇతర పెద్ద నగరాలలో రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఉపయోగం లభించనుంది.
* ఇక అన్ రిజర్వుడు విభాగంలో పెంచిన ఛార్జీలు ముందుగా ప్రకటించిన విధంగా నేటి నుంచి కాకుండా 28 నుంచి అమలువుతాయి.
* నేటి నుంచి చేపట్టే ప్రయాణాల కోసం ప్రీమియం రైళ్లలో అంతకుముందే టికెట్లు బుక్ చేసుకున్నవారు పెరిగిన ఛార్జీలను చెల్లించనక్కర్లేదు. మిగతా రైళ్లలో ప్రయాణించే వారు టీటీఈలకు రైళ్లలో లేదా రిజర్వేషన్ కార్యాలయాల్లో పెరిగిన ఛార్జీ చెల్లించాలి.

  • Loading...

More Telugu News