: పోలీసులపై దాడి చేసిన దొంగలు


సికింద్రాబాద్ లోని బొల్లారంలో పోలీసులపై దొంగలు దాడి చేశారు. ఓం సాయి కాలనీలోని జీవీ రెడ్డి అనే మాజీ సైనికాధికారి ఇంట్లో దొంగతనానికి నిన్న రాత్రి దొంగలు యత్నించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు వారిని ప్రశ్నించారు. దీంతో, దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా... పోలీసులు వారిని పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై దొంగలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోయిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News