: పెషావర్ ఎయిర్ పోర్టులో కాల్పులు
పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పెషావర్ ఎయిర్ పోర్టుపై ఈ ఉదయం దాడికి తెగబడ్డారు. సౌదీ నుంచి వచ్చిన విమానంపై కాల్పులు జరుపుతూ ఎయిర్ పోర్టులో భీతావహ వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో ఓ మహిళ మరణించినట్టు సమాచారం. విమానం ల్యాండ్ అవుతుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. కాగా, ఈ ఘటన అనంతరం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిర్ పోర్టు సమీపంలోని భవనాలపై నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. ఇటీవలే తెహ్రీకే తాలిబాన్ తీవ్రవాదులు కరాచీ ఎయిర్ పోర్టుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.