: నేను కళాకారుడ్ని మాత్రమే: కమల్ హాసన్


 హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ లో విశ్వరూపం సక్సెస్ మీట్ లో నటుడు కమల్ హాసన్ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. భారతీయ చలన చిత్రరంగం తనకు జీవితాన్ని ఇచ్చిందని కమల్ అన్నారు. ఎంతో మంది పెద్ద పెద్ద దర్శకులు తనను కొడుకులా ఆదరించడం వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నానని కమల్ అన్నారు. 

' విశ్వరూపం నా సినిమా కాదు. మన సినిమా. ఇప్పుడు నా కుటుంబం చిన్నది కాదు..  చాలా పెద్దదయింది. నాకు ఒక్క ఇల్లు కాదు ఎన్నో ఇళ్లు ఉన్నాయనిపిస్తోంది. మీ అందరి సహకారంతో నేను ఎంతో ధనవంతుడ్నిఅనిపిస్తోంది. నేను రాజకీయ నాయకుడ్ని కాదు.. కేవలం కళాకారుడినే' అని కమల్ అన్నారు. 

తనకు ఎవరి మీదా కోపం లేదని.. భారతదేశంలాంటి దేశంలో ఓ కళాకారుడికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వటమే బాధ కలిగించిందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వరూపం విడుదలకు దాసరి నారాయణరావు చాలా కృషి చేశారని కమల్ కృతజ్ఞత తెలిపారు. 

  • Loading...

More Telugu News