: తానా ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల అంతరంగం’


ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ట్రైస్టేట్ ఆధ్వర్యంలో షికాగోలోని అరోరా హిందూ దేవాలయంలో ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ‘సిరివెన్నెల అంతరంగం’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. తానా టీం స్క్వేర్ (అత్యవసర సేవల విభాగం) కార్యకర్తలను, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన అధ్యక్షుడు నన్నపనేని మోహన్ ను సిరివెన్నెల ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. తానా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరి తానా సేవా కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. గాయకులు పార్థు, సాహితీ, ప్రవీణ్ లు సిరివెన్నెల పాటలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులతో సిరివెన్నెల మాట్లాడుతూ... తన పాటలకు ప్రేరణ, జీవితంపై తన ఆశావహ దృక్పథం, ఓటమి నుంచి పాఠాలు ఎలా నేర్చుకున్నది వంటి పలు విషయాలపై తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తానా ప్రాంతీయ ప్రతినిధి ఆకురాతి రజనీ, కానూరు జగదీష్, కానూరు హేమ, కొలసాని హరీష్, శొంఠి పద్మ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News