: టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై గవర్నర్ ను కలసిన టీ టీడీపీ నేతలు
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ తదితరులు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై తక్షణమే జోక్యం చేసుకుని పరిశీలించాలని కోరారు. ప్రసారాలు నిలిపివేయడం అప్రజాస్వామికమని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని మోత్కుపల్లి మీడియాతో అన్నారు. కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయాలంటూ ఎంఎస్ వోలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.