: హోం మంత్రులు ఎప్పుడైనా 420 కేసుల్లో ఇరుక్కున్నారా?: టీడీపీ
రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా సీబీఐ పేర్కొన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలకు పదునుపెడుతున్నారు. ఓ హోం మంత్రి 420 కేసులో ఇరుక్కోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ ధ్వజమెత్తారు. సబితను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంను డిమాండ్ చేశారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జిషీటులో సబిత పేరు ఉందని తెలిసినా కూడా సహచర మంత్రులు ఆమెకు మద్దతు పలకడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ఇక గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, సబితను రాజీనామా చేయొద్దని ముఖ్యమంత్రి సూచించడం సరికాదని అన్నారు. ఆమె పదవి నుంచి వైదొలగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.