: కూతురు హైస్కూల్ విద్య పూర్తి చేసిందని మడొన్నా పార్టీ
కొప్పున్నమ్మ ఎన్ని ముళ్ళు వేసినా అందమే అన్నట్టు... డబ్బున్నమ్మ ఏం చేసినా ఆనందమే. ఇంటర్మీడియట్ లో ర్యాంకులు సాధించినా మనం పార్టీలు చేసుకునేందుకు వెనకాడుతుంటాం. తన టీనేజ్ కుమార్తె లార్డెస్ హైస్కూలు విద్య పూర్తి చేసిందని పాప్ స్టార్ మడొన్నా 'ప్రీ-ప్రోమ్' పార్టీ ఇచ్చింది. న్యూయార్క్ సిటీలో ఘనంగా ఏర్పాటు చేసిన 'ప్రీ-ప్రోమ్' గార్డెన్ పార్టీలో లార్డెస్ ఆమె స్నేహితులు సందడి చేశారట. తన కుమార్తె 'ప్రీ-ప్రోమ్' పార్టీ విందు ఏర్పాట్లు మడొన్నా స్వయంగా చేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు.