: ఆళ్లగడ్డ, నందిగామ టికెట్లు శోభా, తంగిరాల వారసులకే?
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలిచిన శోభానాగిరెడ్డి, తంగిరాల ప్రభాకర్ ల మృతితో... ఆ టికెట్లు మళ్లీ వారి కుటుంబ వారసులకే దక్కనున్నాయని సమాచారం. ఈ క్రమంలో ఆళ్లగడ్డ నుంచి శోభా కుమర్తెను పోటీకి దింపాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తొలుత ఇక్కడి నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోటీకి దింపాలని అనుకున్నప్పటికీ తర్వాత భూమా కుటుంబానికి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక అటు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల మరణంతో ఆయన కుమార్తె పోటీలో నిలుస్తారని సమాచారం.