: ఈ నెల 30న నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సి-23


నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) నుంచి ఈ నెల 30వ తేదీ ఉదయం 9.49 గంటలకు పీఎస్ఎల్వీ సీ-23 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి 28న ఉదయం 8.49 గంటలకు కౌంట్ డౌన్ మొదలవుతుంది. అనంతరం 49 గంటల తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. పీఎస్ఎల్వీలో ఇది 27వ ప్రయోగమని షార్ డైరెక్టర్ ప్రసాద్ చెప్పారు. దీని ద్వారా ఐదు విదేశీ ఉపగ్రహాలను పంపిస్తున్నామని, పీఎస్ఎల్వీ సీ-23 మొత్తం బరువు 825 కిలోలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News