: స్వరూపానందపై కేసు... సంచలన వ్యాఖ్యల పర్యవసానం
ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై షిరిడిలో కేసు నమోదైంది. సాయిబాబా దేవుడు కాదని, ఆయనను పూజించరాదని స్వరూపానంద నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, సాయి భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. హరిద్వార్ లో స్వరూపానంద దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కాగా, ఈ ఉదయం స్వరూపానంద మీడియాతో మాట్లాడుతూ, సాయిబాబా విషయంలో తర్కబద్ధమైన చర్చ జరగాలని అభిలషించారు.