: ఢిల్లీ అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీకి ఎదురుదెబ్బ!


కాంగ్రెస్ మాజీ ఎంపీ జగదీష్ టైట్లర్ కు ఎదురుదెబ్బ తగిలింది. 1984 ఢిల్లీ అల్లర్ల కేసును తిరిగి తెరిచి, పునర్విచారణ ప్రారంభించాలని ఢిల్లీ కోర్టు ఈ రోజు సీబీఐని ఆదేశించింది. అలాగే, టైట్లర్ కు క్లీన్ చిట్ ఇస్తూ సీబీఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్టును పక్కన పెట్టాలని కూడా చెప్పింది.

ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో ఒక్క ఢిల్లీలోనే 3వేల మంది సిక్కులు బలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి 12 హత్య కేసుల్లో ఇప్పటివరకు 30 మందికి శిక్ష పడింది. ఈ క్రమంలో కేసును విచారించిన సీబీఐ 2007లో టైట్లర్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. 2009లో కేసు ముగించాలని న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. అయితే అల్లర్లలో మరణించిన లక్విందర్ సింగ్ అనే వ్యక్తి భార్య సీబీఐ క్లోజర్ నివేదికను కోర్టులో సవాల్ చేసింది. అల్లర్ల తర్వాత ఇద్దరు కీలక సాక్షులు అమెరికా వెళ్లిపోయారని, వీరిని విచారించకుండానే కేసును మూసివేయాలంటూ కోర్టును సీబీఐ కోరడం వివాదాస్పదమైంది.

  • Loading...

More Telugu News