: 5 రూపాయలకే భోజనం, రూ.3కే టిఫిన్: హరీశ్ రావు
గ్రేటర్ హైదరాబాదులోని బోయిన్ పల్లి మార్కెట్ లో రూ. 5కే భోజనం, రూ.3కే టిఫిన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ పథకాన్ని దశల వారీగా నగరంలోని మిగతా మార్కెట్లకూ విస్తరిస్తామని ఆయన అన్నారు. చెన్నైలో అమలవుతున్న సబ్సిడీ భోజన పథకాన్ని అధ్యయనం చేసేందుకు అధికారులను పంపుతామని ఆయన అన్నారు. నాసిక్ లో ఉల్లి సాగును పరిశీలించేందుకు బృందాన్ని పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కెట్లలో హమాలీల కోసం విశ్రాంతి గదులను ఏర్పాటు చేసే యోచన ఉందని హరీష్ రావు చెప్పారు.