: సౌదీలో 64 భారత అతిథి గృహాల అదృశ్యంపై విచారణ
సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా తదితర ప్రాంతాల్లో 64 అతిథి గృహాలు అదృశ్యం కావడంపై విచారణ జరిపిస్తామని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటించారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారత నవాబులు తమ సంస్థానాల నుంచి మక్కాకు వెళ్లే వారికి వసతి కల్పించేందుకు అతిథి గృహాలు నిర్మించారు. కానీ, స్వాతంత్ర్యానంతర కాలంలో ఇవి కనిపించకుండా పోయాయి. ఇవి ఏమయ్యాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి విచారణ జరిపించాల్సి ఉందని సుష్మ చెప్పారు.