: ఇక చల్లచల్లని 'వయాగ్రా'!


పురుషుల్లో శృంగార ఉద్ధీపనలు పెంచే ఔషధంగా విపరీతంగా ప్రచారంలో ఉన్న వయాగ్రా ఇప్పుడు చల్లచల్లగా అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్లో లభిస్తున్న ఈ ఖరీదైన మెడిసిన్ ను ఐస్ క్రీం రూపంలో తయారుచేశారు. 'లిక్ మీ అయాం డెలీషియస్' అనే వెబ్ సైట్ ఈ వయాగ్రా ఐస్ క్రీమ్ ను ప్రమోట్ చేస్తోంది. కొందరు సెలబ్రిటీ క్లయింట్లు తమ వయాగ్రా ఐస్ క్రీమ్ తుది ఫలితం పట్ల 'సంతృప్తి' వ్యక్తం చేశారని సదరు వెబ్ సైట్ పేర్కొంది.

అయితే, ఇవి మార్కెట్లోకి వచ్చేందుకు చాలా సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. వయాగ్రాలో ఉండే సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే మెడిసిన్ అసాధారణ రీతిలో అంగస్థంభన కలిగిస్తుందని ప్రయోగాల్లో రుజువైంది. ఈ ఔషధానికి 1998లో అనుమతి లభించింది.

  • Loading...

More Telugu News