: ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు విద్యార్థులకు ఏపీ శాసనసభ అభినందనలు
అతిపిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలుగు విద్యార్థులు పూర్ణ, ఆనంద్ కుమార్ లకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ రోజు అభినందనలు తెలిపింది. ఈ మేరకు సభలో తీర్మానం ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు సభలో తెలిపారు.