: నల్లధనంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ శాసనసభ
నల్లధనంపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని అన్నారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని మన దేశానికి రప్పించి... ప్రజా సంక్షేమానికి ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నల్లధనం విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించిందని... ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.