: శ్రీవారి సేవలో మురళీమోహన్
సినీ నటుడు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం తిరుమలలో వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన వెంకటేశ్వరుడిని సేవించుకున్నారు. నేడు ఆయన 75వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.