: 14 మంది రిటైర్డ్ అధికారులకు 3 కోట్లు జీతం
సింగరేణిలో 14 మంది రిటైర్డ్ అధికారులకు 3 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తుండడం పట్ల సింగరేణి జేఏసీ మండిపడుతోంది. సింగరేణి కాలరీస్ 14 మంది జీఎం స్థాయి రిటైర్డ్ అధికారుల సేవలు వినియోగించుకుంటోంది. రిటైర్ అయ్యాక కూడా వీరికి లక్షల్లో వేతనాలు చెల్లిస్తోంది. ఒక్కో అధికారికి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం చెల్లిస్తోంది. వారికి టీఏ, డీఏ, ఇతర సౌకర్యాల కల్పన కోసం సింగరేణి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా, రిటైర్ అయిన వారికి 3 కోట్లు చెల్లించడం పట్ల సింగరేణి జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పలు అనుమానాలున్నాయని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సింగరేణి జేఏసీ హెచ్చరిస్తోంది.