: రెండు రాష్ట్రాల్లోను టీడీపీది సైకిల్ గుర్తే: ఈసీ
తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థనకు ఎన్నికల సంఘం (ఈసీ) సానుకూలంగా స్పందించింది. రెండు రాష్ట్రాల్లోను టీడీపీకి ఒకే గుర్తును (సైకిల్) కేటాయించినట్టు ఈసీ తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. భవిష్యత్ ఎన్నికల్లో టీడీపీ రెండు రాష్ట్రాల్లో సైకిల్ గుర్తుతో పోటీ చేయనుంది. కాగా, సమాజ్ వాదీ పార్టీ గుర్తు కూడా సైకిల్ కావడం విశేషం.