: చిన్నారి అభ్యర్థనను మన్నించిన గూగుల్!


తనకెంతో ఇష్టమైన తండ్రి పుట్టిన రోజు వేడుకను సెలవురోజున సెలబ్రేట్ చేసుకోవాలన్న ఓ చిన్నారి కోరికను గూగుల్ సంస్థ మన్నించింది. గూగుల్ సంస్థలో పని చేస్తున్న చిన్నారి తండ్రికి వారం రోజుల సెలవు మంజూరు చేసి తన సహృదయాన్ని చాటుకుంది గూగుల్. కేటీ అనే చిన్నారి తండ్రి గూగుల్ లో పని చేస్తున్నారు. ఆయనకు శనివారం సెలవు. అతని పుట్టిన రోజేమో బుధవారం వచ్చింది. దీంతో తండ్రి పుట్టిన రోజున సెలవు ప్రకటించాలని కేటీ తన తండ్రి బాస్ కి లెటర్ రాసింది.

దానిని చదివిన కేటీ తండ్రి బాస్ డానియల్ షఫ్లాకోఫ్ ఆ చిన్నారికి ఉత్తరం రాశారు. 'చిట్టితల్లీ! నీ ఉత్తరాన్ని చదివాను. మీ నాన్న గారికి నువ్వు కోరినట్టు ఒక్క రోజు కాదు, వారం రోజులు సెలవు ఇస్తున్నాను. వేసవి కదా అందుకే జూన్ మొదటి వారం మొత్తం మీ నాన్నతో ఆనందంగా గడుపు' అంటూ పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News