: డ్వాక్రా, స్వయం ఉపాధి రుణాలను రద్దు చేయాలి: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా, వివిధ కార్పొరేషన్లలో తీసుకున్న స్వయం ఉపాధి రుణాలను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఓఎంసీ కేసులో కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు అనంతపురం జిల్లా రాయదుర్గంకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నా రైతు రుణాల మంజూరులో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు. ఓఎంసీ గనులు ప్రభుత్వ పరమయ్యేందుకు గతంలో తాము చేసిన ప్రయత్నం ఫలించిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని ఎర్రబెల్లి సలహా ఇచ్చారు.