: 20 రోజులు సామూహిక అత్యాచారం చేసి...అమ్మేయబోయారు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఎత్వా ప్రాంతంలో విజయపాల్, అతని మేనల్లుడు చింకు కలసి 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. తరువాత 20 రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను నేపాల్ తీసుకువెళ్లి అక్కడ అమ్మేసేందుకు ప్రయత్నించారు. చింకు తండ్రి తకావు, బరాన్సి అనే వ్యక్తితో కలిసి బాలికను మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నించాడు.
వీరి నుంచి తప్పించుకున్న బాలిక నేపాల్ లో పోలీసులను ఆశ్రయించింది. వారు ఆమెను స్వస్థలానికి పంపించారు. అక్కడి పోలీసుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు విజయపాల్, చింకులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చింకుతండ్రి, బరాన్సిలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.