: అంజలిని కిడ్నాప్ చేశారా..?


హీరోయిన్ అంజలి అదృశ్యం కేసు మరో మలుపు తిరిగింది. నిన్నటి వరకు అంజలి మిస్సింగ్ ఉదంతంలో ఆరోపణలెదుర్కొన్న ఆమె పిన్ని భారతీదేవి నేడు మాటమార్చింది. నిన్నటి వరకు, అంజలి తనకు ఫోన్ చేసి, తనకోసం ఎవరూ వెతకొద్దన్నదని చెప్పిన భారతీదేవి.. తాజాగా, తన దత్త పుత్రికను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని నేడు చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని భారతీదేవి చెన్నై కమిషనర్ తో చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, అంజలి సోదరుడు రవిశంకర్ నిన్న హైదరాబాద్ లో మిస్సింగ్ కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రవిశంకర్ ను విలన్ గా పేర్కొన్న భారతీదేవి అతనిపైనే సందేహం వ్యక్తం చేసినట్టు సమాచారం! కాగా, ఈరోజు ఉదయం అంజలి తన తల్లితో ఫోన్ లో మాట్లాడిన అనంతరం కేసు ఉపసంహరించుకోవాలని భావించిన ఆమె సోదరుడు రవిశంకర్.. చెన్నైలో భారతీదేవి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన చెల్లి కనిపిస్తేనే కేసు విత్ డ్రా చేసుకుంటానని తేల్చిచెప్పాడు.

  • Loading...

More Telugu News