: అసోంలో కిడ్నాప్ కు గురైన ఏపీ ఇంజనీర్ విడుదల
అసోంలో కిడ్నాప్ కు గురైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు విడుదలయ్యారు. ఐదు రోజుల కిందట ఆయనను బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. నాగమల్లేశ్వరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా కూనంనేనివారిపాలెం. కాగా, ఇంజనీర్ విడుదలకు తీవ్రవాదులు ఆరు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వశిష్ట కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు.