: ఆ కుటుంబంలో డాక్టర్లు పుడతారు!


రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన వినమ్రత పట్ని అనే బాలికకు ఆ రాష్ట్ర వైద్యవిద్య ప్రవేశ పరీక్ష(ఆర్పీఎంటీ) లో 107వ ర్యాంకు వచ్చింది. అంటే, కోర్సులో ప్రవేశం, అనంతరం డాక్టర్ గా ప్రాక్టీసూ లాంఛనమే! ఇందులో విశేషం ఏమిటంటే, ఆమె కుటుంబంలో ఇప్పటివరకు 31 మంది డాక్టర్లున్నారట. తల్లి, తండ్రి, పెదనాన్నలు, బాబాయిలు... ఇలా, డాక్టర్ల పరివారం అన్నమాట. ఫిజీషియన్లు, గైనకాలజిస్టులు, ఆప్తల్మాలాజిస్టులు, ఈఎన్ టీ నిపుణులు, న్యూరాలజిస్టులు, యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులు, పాథాలజిస్టులు, సర్జన్లు, ఆర్థోపెడిక్ నిపుణులు అందరూ ఈ కుటుంబంలో కొలువుదీరారు. వీరిలో అత్యధికులు జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారట.

తనకు ఆర్పీఎంటీలో మెరుగైన ర్యాంక్ వచ్చిన సందర్భంగా వినమ్రత మాట్లాడుతూ, ఇలాంటి కుటుంబంలో తానూ భాగమైనందుకు గర్వపడుతున్నానని పేర్కొంది. బాల్యం నుంచే డాక్టర్ కావాలన్న ఆకాంక్ష బయల్దేరిందని తెలిపింది.

  • Loading...

More Telugu News