: ప్రజల ఆలోచన మారాలి... లంచం తింటే జైలుకే: జడ్జి
లంచం తింటే జైలుకేనన్నది నిబంధనగా మారాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి అన్నారు. ఆరుగురు ప్రభుత్వాధికారులు అక్రమంగా ఎల్టీసీ బిల్లులు లంచంగా తిన్న కేసు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు ప్రభుత్వాధికారులకు జైలు శిక్ష విధించారు. జీవితంలో పైకి రావాలంటే అవినీతే ఏకైకమార్గం అనే అలోచన మారాలని ఆయన సూచించారు.
గత కొంత కాలంగా సమాజంలోని ఓ భాగంలో విజయానికి సులువైన, సురక్షితమైన మార్గం అవినీతేననే ఆలోచన ప్రబలిందని అన్నారు. లంచం తింటే నేరుగా జైలుకే అనేది నిబంధనగా మారితే కాస్త ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతిని సహంచడమంటే నీతిని సహించలేకపోవడమేనని ఆయన అన్నారు. అవినీతిని దాచలేము, రక్షించలేమనే విషయం అర్థమైతే అవినీతి అంతమవుతుందని ఆయన స్పష్టం చేశారు.