: కాసేపట్లో కేసీఆర్ ను కలవనున్న కేంద్ర మంత్రి
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి ఇంతకు మునుపు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే.