: ప్రజలను నిరాశ నిస్పృహల్లోకి నెట్టవద్దు: జగన్


ప్రజలను నిరాశ నిస్పృహల్లోకి నెట్టడం సరికాదని, వారిలో విశ్వాసం కలిగించడమే నాయకత్వ లక్షణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ధన్యవాద ప్రసంగంపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ... నాయకుడు ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించి ముందడుగు వేయాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, కాబట్టి ఏదో ఘోరం జరిగినట్లు మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మన బలాలు-బలహీనతలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

నవ్యాంధ్రప్రదేశ్ కు హైదరాబాదు లేకపోయినా, చక్కని పంటలు పండే వ్యవసాయ భూములు ఉన్నాయని, పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించవచ్చునని జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, అయితే తెలంగాణలోనూ ఐదు జిల్లాలు వెనుకబడే ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాబట్టి, ఎలా అభివృద్ధి సాధించాలా? అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.

  • Loading...

More Telugu News