: బీసీలకు స్పెషల్ ప్యాకేజీ: ధూళిపాళ్ల


ఆంధ్రప్రదేశ్ లోని బలహీన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. ఇవాళ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎవరికీ నష్టం జరగకుండా కాపులను బీసీలో చేర్చే అంశంపై కమిషన్ ఏర్పాటు ఆహ్వానించదగినదని ఆయన అన్నారు.

సుజల స్రవంతి పథకంతో ప్రజలకు మినరల్ వాటర్ ఇచ్చేందుకు కృషి చేస్తామని ధూళిపాళ్ల చెప్పారు. రైతుల రుణమాఫీపై కోటయ్య కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతుల నుంచి రుణాలు వసూలు చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లను కోరినట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News