: ఆ ఆస్పత్రిలో మనుషులకు పశువుల ఇంజెక్షన్లు
ఆ ఆస్పత్రిలో సిబ్బందికి నిర్లక్ష్యం తలకెక్కింది. దాంతో పశువులకు ఇచ్చే ఇంజక్షన్లను మూడు రోజులుగా రోగులకు ఇస్తూ వస్తున్నారు. చివరికి ఓ రోగి బంధువు గమనించడంతో సిబ్బంది తప్పిదం వెలుగు చూసింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో మధురాదాస్ మాధుర్ ఆస్పత్రిలో ఇది జరిగింది. ఓ రోగి బంధువు ఇంజెక్షన్ ప్యాక్ పై కేవలం పశువులకు మాత్రమే అని రాసి ఉండడాన్ని గమనించి వెంటనే అధికారులకు తెలియజేశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై రోగుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో అధికారులు ఆ ఇంజక్షన్లను అందించిన ఫార్మసిస్ట్ పై సస్పెన్షన్ వేటు వేశారు.