: జగన్ తీరు వల్ల రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వని పరిస్థితి తలెత్తుతుంది: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలు బ్రహ్మాండంగా ఉన్నాయని జగన్ అంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలతో తప్పుడు సమాచారం వెళుతుందని... మంచి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి నిధులు ఎందుకివ్వాలని కేంద్ర భావించే అవకాశం ఉందని విమర్శించారు. రాష్ట్రం బాగుపడకూడదనే ఆలోచనలో జగన్, వైకాపా ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షం ఇచ్చే మద్దతు ఇదేనా? అని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై చర్చను రాజకీయ ప్రసంగంలా మార్చారని ఆరోపించారు. మీరు విమర్శించడానికి ఇంకా ఐదేళ్లు ఉన్నాయని... అప్పుడే తొందర ఎందుకు? అని జగన్ ను నిలదీశారు.

  • Loading...

More Telugu News