: అరచేతిలో ఆరోగ్యం..?


ఒకప్పుడు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. కానీ, నేడు టెక్నాలజీ కారణంగా కొంత వెసులుబాటు వచ్చింది. మరికొంత కాలం తర్వాత ఈ పరిస్థితి ఇంకా మారిపోనుంది. రక్తంలో షుగర్ ఎంతుందో తెలుసుకోవాలంటే రక్తపు చుక్క చిందాల్సిందే. కానీ, భవిష్యత్తులో అంత ఇబ్బంది కూడా ఉండదు. జస్ట్ చేతికి ధరించిన స్మార్ట్ వాచ్ లేదా బ్రాస్ లెట్ లో బటన్ నొక్కితే ఎంతుందో చెప్పేస్తాయి. అంతేకాదు రక్తపోటు స్థాయిని కూడా తెలియజేగలవు. గూగుల్, యాపిల్ తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఈ తరహా వేరబుల్ గాడ్జెట్లపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇందు కోసం శాస్త్రవేత్తలను, ఇంజనీరింగ్ నిపుణులను భర్తీ చేసుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News