: ఇది చాలా గర్వకారణం: ప్రధాని మోడీ
గుజరాత్ లోని పటాన్ పట్టణంలో ఉన్న దిగుడు బావికి (రాణీ కీ వావ్) యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు లభించడం చాలా గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. గుజరాత్ ను సందర్శించినప్పుడు తప్పకుండా 'రాణీ కీ వావ్'ను కూడా చూడాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు. దీనిని మన దేశ గొప్ప సంస్కృతి, కళకు చిహ్నంగా పేర్కొన్నారు.