: రైలు చార్జీల పెంపును తూర్పారబట్టిన శివసేన


రైలు చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని, ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన శివసేన తప్పుబట్టింది. ఈ నిర్ణయం వల్ల ముంబై ప్రజలపై భారం పడుతుందని నిరసన వ్యక్తం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ రైలు చార్జీలను పెంచి ఉంటే బీజేపీయే ముందుగా దాన్ని వ్యతిరేకించి ఉండేదని అభిప్రాయపడింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం వెలువడింది. ఇకపై రైలు చార్జీలను పెంచవద్దని, సామాన్యులపై భారం మోపవద్దని అందులో కోరింది. ప్రయాణీకుల చార్జీలను 14.2 శాతం, రవాణా చార్జీలను 6.5శాతం పెంచుతూ రైల్వే శాఖ రెండు రోజుల క్రితం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పెంపు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుంది.

  • Loading...

More Telugu News