: ఎస్ఎఫ్ఐ దాడిపై మమతాబెనర్జీ ఆగ్రహం.. చిదంబరంతో సమావేశం రద్దు !


నిన్న ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తృణమూల్ మంత్రిపై దాడి ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ధికమంత్రి చిదంబరంతో ఈరోజు సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. మరోవైపు మంత్రిపై జరిగిన దాడిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.

మంగళవారం మన్మోహన్ ను కలిసేందుకు సీఎం మమతా బెనర్జీ, బెంగాల్ ఆర్ధికమంత్రి అమిత్ మిత్రాతో కలిసి ప్రధాని కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ సమయంలో లోపలికి వెళ్లబోతున్న అమిత్ మిత్రాపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఒక్కసారిగా దాడిచేసి చొక్కా చించివేశారు. ఈ అనూహ్య ఘటనపై నిశ్చేష్ఠురాలైన మమతా తీవ్రంగా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News