: 'మహారాజా' స్థానాన్ని ఆక్రమించనున్న 'సామాన్యుడు'!
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా 'మస్కట్' మారనుంది. ఇప్పటివరకు ఉన్న మహారాజా మస్కట్ స్థానాన్ని ఇకపై సామాన్యుడు ఆక్రమించనున్నాడు. ఈ మేరకు ప్రధాని మోడీ విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు సూచించినట్టు సమాచారం. గత కొంతకాలంగా నష్టాల్లో కొనసాగుతున్న ఎయిరిండియాకు కొత్త జవజీవాలు అందించే చర్యల్లో భాగంగానే మస్కట్ మార్పు అని తెలుస్తోంది. మంత్రి అశోక్ గజపతిరాజు, విమానయాన శాఖ కార్యదర్శి అశోక్ లావసాలతో మాట్లాడిన మోడీ వారికి పలు సూచనలు చేశారు. ఎయిరిండియాను లాభాల బాటలో నడిపేందుకు ఏం చేయాలో చెబితే, అవసరమైన వనరులను సమకూర్చుతామని వారికి ప్రధాని స్పష్టం చేశారు.