: పాకిస్థాన్ లో 118 మంది లంకేయుల అరెస్టు


పాకిస్థాన్ లో 118 మంది శ్రీలంక వాసులు అరెస్టయ్యారు. పాక్ లోని ఖైబర్ ఫక్తూంక్వా గిరిజన ప్రాంతంలో అక్రమంగా నివాసం ఉంటున్న 118 మంది శ్రీలంక వాసులను పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి గుర్తింపు లేకుండా, అక్రమంగా నివాసం ఉంటున్న వారి కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని ఫక్తూంక్వా సీనియర్ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ నజీబ్-ఉర్-రహ్మాన్ తెలిపారు. సుమారు 700 మంది వివిధ ప్రాంతాలకు చెందినవారు అక్రమంగా నివాసం ఉంటున్నారని ఆయన చెప్పారు.

ఉత్తర వజీరిస్థాన్ లో కూడా చొరబాట్లు జరుగుతున్నాయని తెలిపిన ఆయన, అక్కడ కూడా సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేస్తామన్నారు. కాగా పాకిస్థాన్ లోని హైతబాద్ ప్రాంతంలో భారీ ఎత్తున విదేశీయులు అక్రమంగా నివాసం ఉంటున్నారని ఆయన వెల్లడించారు. నెదర్లాండ్స్, యూరోపియన్, ఆఫ్రికా, అమెరికా వంటి దేశాలకు చెందిన తీవ్రవాదులు పాక్ లో ఆశ్రయం పొందుతున్నారని నెదర్లాండ్స్ మంత్రి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అక్రమ నివాసితులను పాక్ గుర్తించడం విశేషం.

  • Loading...

More Telugu News